బడి ఈడు పిల్లలను బడిలో చేర్చాలి

Apr 15,2025 22:24
చేర్చాలని ఎంఇఒ వైఆర్‌కె.చౌదరి అన్నారు.

ప్రజాశక్తి – పెద్దాపురం

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని ఎంఇఒ వైఆర్‌కె.చౌదరి అన్నారు. మండల పరిధిలోని కొండపల్లి గ్రామంలో ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, సౌకర్యాలు, విద్యా బోధన, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలపై ప్రజలకు వివరించారని తెలిపారు. పాఠశాలల పరిధిలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎంలు ఫణికుమార్‌, జిపిఎ.రాజు, ఉపాధ్యాయులు ఎంఎంకెవి.ప్రసాద్‌, వై.ఏసుకుమార్‌ పాల్గొన్నారు.

➡️