ప్రజాశక్తి – గండేపల్లి
రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఆదిత్య యూనివర్సిటీ సూరంపాలెం ఆధ్వర్యంలో బీచ్ క్లీనప్ డ్రైవ్ నిర్వహించినట్లు డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, సముద్ర కాలుష్య నివారణ, మరియు సామాజిక బాధ్యత పై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరాక్ట్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు కలిసి తీర ప్రాంతాన్ని శుభ్రం చేయడం ద్వారా సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించేందుకు సహాయపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థులను వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంబి. శ్రీనివాస్, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్.రమాశ్రీ, రిజిస్టర్ డాక్టర్ జి.సురేష్, డీన్ క్యాంపస్ లైఫ్ ప్రొఫెసర్ వి.సత్యనారాయణ, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వరప్రసాద్, రోట్రాక్ట్ క్లబ్ సభ్యులు వి.వి.శ్రీమన్నారాయణ అభినందించారు.