ప్రజాశక్తి – పిఠాపురం
పట్టణంలోని 2, 3, 4వ వార్డులో మురికి నీరు పూర్తి స్థాయిలో పారేలే డ్రెయిన్లను నిర్మించాలని సిపిఎం నాయకులు కె.విశ్వనాథం డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో సిపిఎం ప్రజాచైతన్య యాత్ర బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు పలు సమస్యలను బృందం దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వైఎస్‌ఆర్ గార్డెన్స్‌లో డ్రెయినేజీని నిర్మిస్తున్నారని, అయితే ఆ డ్రెయిన్‌ను వజ్రాల కాలువ వరకు నిర్మించకుండా సగంలోనే పనులను నిలిపివేశారని తెలిపారు. దీనివల్ల పైనుంచి వచ్చే మురికి నీరంతా అక్కడే నిల్వ ఉండిపోవడంతో ప్రజలకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి డ్రెయినేజీని వజ్రాల కాలువ వరకు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం, వీధిలైట్లు నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.చిన్న, కోనేటి రాజు, వి.సూర్యనారాయణ, కె.మణి, రాజ్యలక్ష్మి, మణికంఠ, నాగేశ్వరరావు, పాల్గొన్నారు.