విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన

Apr 10,2025 23:22
జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు.

ప్రజాశక్తి – గండేపల్లి

మండలంలోని సింగరంపాలెం గ్రామంలో రూ.3.29 కోట్లతో చేపట్టే విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎంఎల్‌ఎ జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. టిడిపి మండల అధ్యక్షులు పోతుల మోహనరావు తండ్రి పోతుల వీర్రాజు జ్ఞాపకార్థం ఈ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ప్రభుత్వానికి దానం చేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మండలంలో మొత్తం 7 సబ్‌ స్టేషన్‌లు ఉండగా వాటిలో 6 సబ్‌స్టేషన్లను టిడిపి పాలనలోనే నిర్మించడం జరిగిందన్నారు. ప్రస్తుతం చేపట్టిన సబ్‌ స్టేషన్‌ నిర్మాణం వల్ల సింగరంపాలెం, రామయ్యపాలెం, ఎన్‌టి రాజాపురం గ్రామాల్లో ఉన్న 400 బోర్లకు సవవృద్ధిగా విద్యుత్‌ సరఫరా అవుతుందని, గృహాలకు వోల్టేజ్‌ సమస్య తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చలగల్ల దొరబాబు, ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ గొర్ల ప్రసాద్‌, ఇఇ బలబద్రపు వీరభద్రరావు, డిఇఇలు కె.మలాకి, బి.జ్యోతి, ఎఇ ఎస్‌.కిరణ్‌కుమార్‌, నాయకులు కోర్పు లచ్చయ్యదొర, ఎస్‌విఎస్‌.అప్పలరాజు, కోర్పు సాయితేజ, అడబాల భాస్కరరావు, కొత్త కొండబాబు, కుంచె రాజా, కందుల చిట్టిబాబు పాల్గొన్నారు..

➡️