ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి డివి.రాఘవులును గెలిపించాలని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచారం జరిగింది. పలు ప్రాంతాల్లో ఎంఎల్‌సి ఇళ్ళ వెంకటేశ్వరరావు(ఐవి) మంగళవారం పర్యటించి ఓటర్లను అభ్యర్థించారు.
ప్రజాశక్తి – యంత్రాంగం
పిఠాపురం ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ బలపర్చిన అభ్యర్థి దిడ్ల వీర రాఘవలుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు కోరారు. స్థానిక ఆర్‌ఆర్‌బిహెచ్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాల, ఎల్‌ఐసి, మున్సిపల్, ట్రెజరీ కార్యాలయలు, కోర్ట్‌ల్లో పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి దిడ్ల వీర వీరరాఘవులుకి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యుటిఎఫ్, ఇతర ప్రజాసంఘాలు బలపరుస్తున్న పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. పిడిఎఫ్ తరపున 2007 సంవత్సరం నుంచి సుమారు 26 సార్లు 13 మంది ఎంఎల్‌సిలను గెలిపించుకోవడం జరిగిందన్నారు. గతంలో జార్జి విక్టర్ ప్రస్తుతం తాను ఎంఎల్‌సిలుగా గెలిచి పని చేయడం జరిగిందన్నారు. వీరరాఘవులును కూడా అదే విధంగా గెలిపించి శాసనమండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే, నిలదీసే విధంగా ప్రజా ఉద్యమాలకు మద్దతుగా ఉండేలా చూడాలన్నారు. వీరరాఘవులు గత 40 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలతో విడదీయని బంధం ఉందని తెలిపారు. శాసనమండలిలో ప్రజా గొంతుకు వినిపించేందుకు ప్రతి ఒక్కరు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, ఐలు, ప్రజాసంఘాల నాయకులు కె చిన్న, సూరిబాబు, సీతారామరాజు, శ్రీనివాసు,రెడ్డి, విశ్వనాథం, భాస్కర్, వీరబాబు, రాజేష్, సిద్దు, సూర్యనారాయణ, గోవిందాచారి, గోపాలకృష్ణ, కె.రాజు, నాగేశ్వరరావు, డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు బలపరిచిన పిడిఎఫ్ అభ్యర్థి డివి. రాఘవులుని గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిగా గెలిపించుకుని ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకుందామని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబిరాణి పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి చెల్లిస్తానని వాగ్దానం చేసి ఆధికరంలోకి రాగానే అప్పులను సాకుగా చూపించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందన్నారు. నిరుద్యోగులను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వం తమ అభ్యర్థికి ఓటేయాలని ఎలా అడుగుతాదని ప్రశ్నించారు. గత, ప్రస్తుత పిడిఎఫ్ ఎంఎల్‌సిలు ప్రజల పక్షాన పోరాటాలు సాగించారని, అదే బాటలో డివి.రాఘవులు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కావున పట్టభద్రులు పిడిఎఫ్ అభ్యర్థి డివి.రాఘవులుకు మొదటి ప్రాధాన్యత వేసి గెలిపించలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి, చంద్రమళ్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, నర్ల ఈశ్వరి, రొంగల ఈశ్వరరావు, నక్కెళ్ల శ్రీను, టి.రాజా, మెడిశెట్టి వెంకట రమణ, కామేశ్వరి, విఒఓ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు గంగా భవాని, ఈశ్వరి భాయి, సహకార సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. యు. కొత్తపల్లి స్థానికంగా ప్రజాసంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు జి.బేబీరాణి, దువ్వా శేషబాబ్జి పాల్గొని మాట్లాడారు. ఈనెల 27న జరిగే ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల్లో పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ఎమ్మెల్సీగా పిడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్న డివి రాఘవులును గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురాల అప్పారావు, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కెవివి.సత్యనారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు చీకట్ల సాంబశివకుమార్, చిన్ని వెల్లంకిసత్యనారాయణ, వాసు సుబ్రమణ్యం, శ్రీను, గంగాధర, సింహాచలం, సూరిబాబు, కూనిచిట్టి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామర్లకోట పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి డివి.రాఘవులు విజయానికి ఎంఎల్‌సి ఇళ్ళ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను సందర్శించారు. పిడిఎస్ ఎంఎల్‌సి అభ్యర్థి రాఘవులును గెలిపించాలని ఉపాధ్యాయులు, పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెక్రటరీ నరవ సురేష్‌కుమార్, ప్రజా సంఘాల నాయకులు కరణం ఏడుకొండలు, దారబాని కృష్ణ, చల్లా మహేష్, పసుపులేటి వీరబాబు, దారబాని సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.