ప్రజాశక్తి – కాకినాడ
నగరంలోని 12వ డివిజన్ స్వర్ణాంధ్ర కాలనీలోని టిడ్కో గృహా సముదాయంలో ఆదివారం తెల్లవారుజాము 3 గంటల నుంచి ఎఎస్‌పి దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో రికార్డ్స్ లేని టూవీలర్ వెహికల్స్‌ను సీజ్ చేసి పోర్టు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కొన్ని గృహాలలో హిజ్రాలు అద్దెకు ఉంటూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న హిజ్రాలను ఎఎస్‌పి కౌన్సిలింగ్ ఇచ్చారు. అసాంఘిక కార్యక్రమాలను వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.