ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

Jan 10,2025 22:55

సంక్రాంతి సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగం కాకినాడ సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ఇఒ సహాయ కమిషనర్‌ కె.విజయలక్ష్మి అన్నారు. స్థానిక జగన్నాథపురం ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌లో సిబ్బంది, విద్యార్థులు ఆనందోత్సాహాలతో సంక్రాంత్రి సంబరాల్లో పాల్గొన్నారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలకు ఇఒ బహుమతులు ప్రదానం చేసారు. ఎంఎస్‌ఎన్‌.డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ జి.ఉషారాణి, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కె.విజయలక్ష్మి, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎంఎస్‌.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.శంఖవరం కత్తిపూడిలోని మాధురి విద్యాలయంలో విద్యాలయం చైర్మన్‌ పడారి తమ్మయ్య బాబు, సీతాదేవి దంపతులు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సామర్లకోట ప్రతిభ విద్యానికేతన్‌ పాఠశాలలో కరస్పాండెంట్‌ ఎస్‌వివిజి.ప్రకాష్‌, పాఠశాల డైరెక్టర్‌ సుధారాణి ప్రకాష్‌ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ టి.సునీత, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.శ్రీగౌరి పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని కోరింగ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన ఈ సంబరాలను కళాశాల చైర్మన్‌ దున్నా జనార్థన రావు, కరస్పాండెంట్‌ ప్రగళ్లపాటి కనకరాజు, డైరక్టర్లు చిట్టూరి కలికిమూర్తి భోగిమంట వెలిగించి ప్రారంభించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సువర్ణ జ్యోతి, పాఠశాల హెచ్‌ఎం ఉమ, కొమ్మూరి మాలతి పాల్గొన్నారు. పోలేకుర్రు పంచాయతీలో సర్పంచ్‌ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ రహిత సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బల్ల సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.జ్యోతి సుధ, ఉప సర్పంచ్‌ దడాల గణేష్‌, మాజీ సర్పంచ్‌ దడాల బుజ్జిబాబు, వనమాడి రాంబాబు, బట్రాజు నరసయ్య, సమ్మిడి వీర్రాజు పాల్గొన్నారు. తాళ్లరేవు సంక్రాంతి సంబరాలను సత్యసాయి హైస్కూల్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహించారు. హైస్కూల్‌ ప్రిన్సిపల్‌, కరస్పాండెంట్‌ పట్టా ఆదినారాయణ వర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో వర్మ దంపతులు, హైస్కూల్‌ హెచ్‌ఎం ఎస్‌ఎన్‌.రాజు దంపతులు భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. ఉపాధ్యాయులు ప్రకాశరావు, శిరీష, కెవి.రమణ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని కోరింగ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. విద్యార్థులు, అధ్యాపకులు నిర్వహించిన ఈ సంబరాలను కళాశాల చైర్మన్‌ దున్నా జనార్థన రావు, కరస్పాండెంట్‌ ప్రగళ్లపాటి కనకరాజు, డైరక్టర్లు చిట్టూరి కలికిమూర్తి భోగిమంట వెలిగించి ప్రారంభించారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సువర్ణ జ్యోతి, పాఠశాల హెచ్‌ఎం ఉమ, కొమ్మూరి మాలతి పాల్గొన్నారు. పోలేకుర్రు పంచాయతీలో సర్పంచ్‌ వెంటపల్లి నూకరాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బల్ల సంధ్యారాణి, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.జ్యోతి సుధ, ఉప సర్పంచ్‌ దడాల గణేష్‌, మాజీ సర్పంచ్‌ దడాల బుజ్జిబాబు, వనమాడి రాంబాబు, బట్రాజు నరసయ్య, సమ్మిడి వీర్రాజు పాల్గొన్నారు. ప్రత్తిపాడు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రత్తిపాడు వెలుగు ఎపిఎం వెంకట్రావు అన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం రాచపల్లిలో ప్రకతి వ్యవసాయం సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎపిఎం వెంకట్రావు మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. పెద్దాపురం డిఎస్‌పి శ్రీహరి రాజు పర్యవేక్షణలో ఎన్‌టిఆర్‌ కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల చిత్రనలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సిఐ కె.క్రాంతి కుమార్‌, ఎస్‌ఐ వి.మౌనిక పోటీలన పరిశీలించారు. గొల్లప్రోలు దుర్గాడలోని విశ్వభారతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో సంక్రాతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్‌ సుంకర వీరబాబు ఆధ్వర్యంలో విద్యార్థులు పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కతిక కార్యకలాపాలతో పాటు బోగి మంటలు వేశారు. గండేపల్లి శ్రీగీతం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కరెస్పాండెంట్‌ బిఎస్‌పి చౌదరి బహుమతులు అందించారు. సాయంత్రం కబడ్డీ పోటీలతో పాటు, విద్యార్థుల నృత్యాలు, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలు నిర్వహించారు. జగ్గంపేట జె.కొత్తూరులో హ్యాపీ చిల్డ్రన్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో కస్పాండెంట్‌ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.వెయ్యి, ద్వితీయ బహుమతిగా రూ.500 ప్రైజ్‌ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ శ్రీనివాస్‌, ఎంపిటిసి మడగల పెద్దకాపు, నర్సే కృష్ణార్జున, నకిరెడ్డి పెదకాపు , కనక దుర్గ ఆలయ కమిటీ చైర్మన్‌ నకిరెడ్డి శివ పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని స్థానిక ఆర్‌ఆర్‌బి హెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రిన్సిపల్‌ కేశవరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పాశ్చాత్య పోకడలతో నేటి యువతరం సంస్కతీ సంప్రదాయాలను మరిచిపోకూడదన్నారు. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం.సుందరయ్య, హుస్సేన్‌ మోహిద్దీన్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ కాశీ విశ్వనాథం, డాక్టర్‌ శారద, ఆఫీస్‌ హెడ్‌ సురేష్‌ పాల్గొన్నారు.

➡️