సిపిఎం ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

May 19,2024 13:05 #Kakinada

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ఎండపల్లి జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షురాలు బేబీ రాణి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి తొలి రోజు మజ్జిగని పంపిణీ చేశారు తొలిత సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండు ఎండల్లో పనులు చేసుకుంటున్న కూలీలకు చలివేంద్రం ఉపయోగకరంగా ఉంటుందని సామాన్యులు చలివేంద్రంలో పంపిణీ చేస్తున్న మజ్జిగని వినియోగించుకోవాలని కోరారు. సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శిజి అప్పా రెడ్డి, సిఐటియు మండల అధ్యక్షులు కే నాగేశ్వరరావు, కార్యదర్శి కే వి వి సత్యనారాయణ, బిల్డింగ్ వర్కర్స్ మండల కార్యదర్శి సిహెచ్ సాంబశివ కుమార్, ఎం సూరిబాబు, ఎస్ సింహాచలం, డి సోమరాజు, వి గంగాధర్ రావు, రాజు, వైసీపీ నాయకులు డి.రాజ్ కుమార్ పాల్గొన్నారు.

➡️