ప్రజాశక్తి – కాకినాడ
క్లాప్ వాహనం డ్రైవర్ల బకాయి జీతాలు చెల్లిం చాలని మంగళవారం మున్సి పల్ ఆఫీస్ వద్ద ధర్నా కార్య క్రమం చేపట్టారు. ఈ ధర్నా లో క్లాప్ వాహన డ్రైవర్స్ యూని యన్ గౌరవాధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. పండగ సమయంలో కూడా కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితిని మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ తెచ్చిపెట్టడం దారుణమన్నారు. తమ కుటుంబాన్ని పోషించు కోవడం కోసమే నెలంతా పని చేస్తారని, ఆవిధంగా చేసిన పనికి 3 నెలలుగా జీతాలు చెల్లించక పోవడం ఘోరాతి ఘోరమని అన్నారు. గత మూడు రోజలుగా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరి కాదన్నారు. మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ, పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మేడిశెట్టి వెంకటరమణ క్లాప్ డ్రైవర్ల ధర్నాకు మద్దతు తెలిపారు. ధర్నా శిబిరానికి వచ్చిన ఎంహెచ్‌ఒ డాక్టర్ పృథ్వీచరణ్ కాంట్రా క్టర్‌తో మాట్లాడి వారం రోజుల్లో జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్మికుల విధుల బహిష్కరణపై పునరాలోచన చేయాలని కోరారు. అనంతరం యూనియన్ నాయకులు ఇదే అంశంపై చర్చించారు. జీతాలు తమ బ్యాంకు ఖాతాల్లో పడేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిం చాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో క్లాప్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు సంతోష్, ఇస్మాయిల్, విక్టర్, కొండబాబు, శివశంకర్, గంగాధర్, అరుణ్‌కుమార్, సూరిబాబు, భైరవ స్వామి, దుర్గాప్రసాద్, దుర్గ బాబు పాల్గొన్నారు.