సిఎం బస్సు యాత్ర ట్రయల్‌ రన్‌

Apr 18,2024 22:56
సిఎం జగన్మో

ప్రజాశక్తి – సామర్లకోట

సిఎం జగన్మో హనరెడ్డి సిద్ధం బస్సు యాత్ర రోడ్‌ షో 19వ తేదీ శుక్రవారం పెద్దాపురం ఎడిబి రోడ్డు మీదుగా సాగనుంది. ఇందుకు సంబంధించి సిఎం కాన్వారు ట్రయల్‌ రన్‌ను గురువారం సాయంత్రం నిర్వహించారు. పెద్దాపురం డిఎస్‌పి లతాకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ట్రయల్‌ రన్‌ను పెద్దాపురం ఏడీబి రోడ్డు మీదుగా సామర్లకోట రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ నుంచి అచ్చంపేట వంతెన మీదుగా ఉండూరు, కొప్పవరం గ్రామాల మీదుగా కాకినాడ అచ్చంపేట సెంటర్‌ వరకూ కొనసాగించారు. ఈ ట్రయల్‌ రన్‌లో జిల్లాస్థాయి పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️