ఫ్యామిలీ కార్డుతో మెరుగైన వైద్య సేవలు : కలెక్టర్‌

Dec 10,2024 23:37
కార్డుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి

ప్రజాశక్తి – కాకినాడ

మెడికవర్‌ హాస్పిటల్స్‌ ప్రవేశ పెట్టిన మెడికవర్డ్‌ ఫ్యామలీ కార్డుతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి అన్నారు. మెడి కవర్‌ హాస్పిటల్స్‌ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మెడికవర్డ్‌ ఫ్యామిలీ కార్డును కలెక్టర్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు అని అన్నారు. మెడకవర్‌ హస్పిటల్స్‌ ప్రవేశపెట్టిన ఫ్యామిలీ కార్డు వల్ల మెరుగైన వైద్య సేవలు సామాన్యు లకు మరింత చేరువ అవుతాయన్నారు. ఆర్థిక స్థోమత గురించి చింతించకుండా కుటుంబ సంరక్షణ, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే దిశగా ఈ ఫ్యామిలీ కార్డు ఒక ముందడుగు అని తెలిపారు. అనంతరం మెడికవర్‌ హాస్పిటల్స్‌ సెంటర్‌ హెడ్‌ ఎం.శుభాకర రావు మాట్లాడుతూ విశ్వసనీయ ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తున్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ ఇప్పుడు మెడికవర్డ్‌ ఫ్యామిలీ కార్డ్‌తో సామాన్య ప్రజలతో బంధాన్ని బలోపేతం చేయడానికి తాము సేవ చేసే ప్రతి కుటుంబానికి అత్యాధునిక పరికరాలు, సదుపా యాలతో, అనుభవజ్ఞులైన డాక్టర్లతో మెరుగైన ఆరోగ్య సంర క్షణ ప్రయోజనాలను విస్తరించడానికి తాము కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు తమ 23 మెడికవర్‌ హాస్పిట ల్స్‌లో ఒపి కన్సల్టేషన్‌లపై 30 శాతం తగ్గింపు, ఒపిడి పరిశో ధనలపై 15 శాతం తగ్గింపు, ఐపి అండ్‌ డే-కేర్‌ సేవలపై 10 శాతం తగ్గింపు (ఫార్మసీ, వినియోగ వస్తువులు మినహా), బీమా కార్పొరేట్‌ అడ్మిషన్ల కోసం వైద్యేతర సేవలపై 50 శాతం తగ్గింపు, 10 కిమీ లోపు ఉచిత అంబులెన్స్‌ పికప్‌, డ్రాప్‌, హోమ్‌ కేర్‌ సేవలపై 30 శాతం తగ్గింపు (ఫార్మసీ మినహా), రూ.5000 కంటే ఎక్కువ బిల్లులకు ఫార్మసీపై 20 శాతం తగ్గింపు, హెల్త్‌ చెక్‌అప్స్‌పై 10 శాతం తగ్గింపు పొందవచ్చ న్నారు. ఈ కార్డ్‌ గరిష్టంగా నలుగురు కుటుంబ సభ్యులను కవర్‌ చేస్తుందన్నారు. మెడికవర్‌లో ఖర్చు చేసే ప్రతి 1000కి ఒక్కో పాయింట్‌కి ఒక రూపాయి చొప్పున రీడీమ్‌ చేసుకోగలిగే ఫ్యా మిలీ రివార్డ్‌లను అందిస్తుందన్నారు. లబ్ధిదా రులు పేరు, వయస్సు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, బ్లడ్‌ గ్రూప్‌ వంటి వివరాలను అందిం చడం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. దీని తర్వాత ప్రత్యేకమైన క్యూఆర్‌ కోడ్‌తో కూడిన డిజిటల్‌ కార్డ్‌ వెంటనే వాట్సాప్‌ ద్వారా జారీ చేయబడు తుందన్నారు. అనంతరం ఫిజికల్‌ నమోదు చేయబడిన చిరునామాకు కార్డ్‌లు అందించబడతాయి అని తెలిపారు. అనంతరం మెడికవర్‌ హాస్పిటల్స్‌ కాకినాడ మార్కెటింగ్‌ హెడ్‌ ఎన్‌.నాగరాజు మాట్లాడుతూ మెడికవర్డ్‌ కార్డుతో ఎక్కడ ఉన్నా, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

➡️