అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్‌

Sep 30,2024 23:37
కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశించారు.

ప్రజాశక్తి – పిఠాపురం

పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ ఆదేశించారు. సోమవారం స్థానిక డాక్టర్‌ బి ఆర్‌ అంబేడ్కర్‌ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్లో పిజిఆర్‌ఎస్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ తోపాటు, ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్‌ జెడి జి.శ్రీనివాసరావు, డిఎల్‌డిఒ పి నారాయణమూర్తి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, ఫించను, బియ్యం కార్డులు మంజూరు, టిడ్కొ గహాలు, ఇళ్ల స్థలాలు, కేఎస్‌ఈజెడ్‌ భూమి ఆన్‌ లైన్లో నమోదు, ఆక్రమణలు తొలిగింపు, డ్రెయిన్‌, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికేట్‌ మంజూరు, వైద్య ఆరోగ్యం, ఆరోగ్య శ్రీ సేవలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంటి అంశాలకు చెందిన 206 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పిజిఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరిత గతిన సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కా రాలు అందించాలని ఆదేశించారు. పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

➡️