ప్రజాశక్తి – కాకినాడ
ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని జరిగింది. ఈ సమావేశంలో గత 15 రోజుల్లో వచ్చిన దరఖా స్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిజిఆర్‌ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ సమావేశం ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుం దన్నారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఫిర్యాదును పరిశీలిం చడం జరుగుతుందని తెలిపారు. ప్రధానంగా ఇన్‌ఫుట్ సబ్సిడీ, విద్యుత్ వైర్లు బిగింపు, ఫోల్ షిఫ్టింగ్, పౌరసరఫరాల శాఖకు సంబంధించి, ఎండోమెంట్ శాఖకు సంబంధించి, ఫిషరీస్ శాఖకు సంబంధించి, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి, పింఛన్ల మంజూరు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూ రికార్డుల ఆన్‌లైన్, డ్రెయిన్, కాలువల్లో పూడిక తొలగింపు శ్మశాన వాటికలకు స్థలం మంజూరు తదితర అంశాలకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదు గురించి సంబంధిత అధికారులకు పూర్తి అవగాహనతో సమావేశానికి హాజరుకావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, వీటిని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో సిసి డ్రెయిన్లు, సిసి రోడ్లకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదించిన పనులకు ఆమోదం మంజూరు చేయడం జరిగిందని, ఆయా పనులు అన్నింటిని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వివిధ శాఖాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.