ప్రజాశక్తి – కాకినాడ
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రుణం తీర్చుకుందాం రండి అని అంబేద్కర్ సేవా కేంద్రం ఛైర్మన్ స్వర్ణాంధ్ర రాంబాబు పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ భవన్ హాస్టల్‌కు రూ.50 వేల విలువ చేసే ఫ్యాన్లను ఎల్‌ఐసి విశ్రాంత డివిజనల్ మేనేజర్ బిఎస్‌ఎన్. మూర్తి చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత జిఎంసి.బాలయోగి ఈ హాస్టల్‌లోనే చదువుకు న్నారని, ఆయన స్ఫూర్తితో తాము సేవా కార్య క్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశించిన పే బ్యాక్ టు సొసైటీ నినాదంతో ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, రాజకీయ నాయకులు జాతి అభివృద్ధి కోసం పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. తనతో పాటు అంబేద్కర్ సేవా కేంద్రం సేవలకు సహకరిస్తున్న సాంబత్తులు వెంకట్రావు, మారెళ్ళ శ్రీనివాస్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల విశ్రాంత ప్రిన్సి పల్ పాకా చందర్రావు, ఎల్‌ఐసి విశ్రాంత అధికారి దాడాల నాగేశ్వరరావు, వైద్యశాఖ ఉద్యోగి ప్రభు దాస్, విశ్రాంత మండలాధికారి కలవల వెంకటేశ్వ రరావు, దయాకర్, శేఖర్, రమేష్ పాల్గొన్నారు.