ఆదిత్య డిగ్రీ కళాశాలలో కామర్స్‌ ఫెస్ట్‌

Apr 13,2025 22:55
కామర్స్‌ ఫెస్ట్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు.

ప్రజాశక్తి – కాకినాడ

నగరంలోని లక్ష్మీ నారాయణ నగర్‌లో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాల కామర్స్‌ విభాగం విద్యార్థులు కామర్స్‌ ఫెస్ట్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరా- 2025 బ్రోచర్‌ను అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌.నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్‌ విభాగం విద్యార్థులు దశాబ్దకాలంగా ప్రతి ఏటా ‘ఆరా’ కామర్స్‌ ఫెస్టు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనివల్ల విద్యార్థుల్లో నాయకత్వ లక్షణంతోపాటు, నిర్వహణ, సామర్థ్యం, సమయపాలన పెరుగుతుందని తెలిపారు. సైన్స్‌ విద్యార్థులతో పోటీపడి కామర్స్‌ విద్యార్థులు ఈ రకమైన విజయాలు సాధిస్తున్న విద్యార్థులను అభినందించారు. ప్రముఖ సాఫ్ట్‌ స్కిల్‌ ట్రైనర్‌ అబ్దుల్‌ అజీజ్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ ఎన్‌.శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్‌ నల్లమిల్లి సుగుణారెడ్డి, వైస్‌ ప్రిన్సిపల్‌ సి.సత్యనా రాయణ, ఇన్‌ఛార్జ్‌ మూర్తి అభినందించారు. ఈ కార్యక్రమంలో కామర్స్‌ విభాగాధిపతి ఎస్‌.ఎజి అలీ, స్రవంతి, నరసింహారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️