ప్రజాశక్తి – ఏలేశ్వరం
సమాజ మార్పు గురువుతోనే సాధ్యమని ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ అన్నారు. పదవి విరమణ చేసిన స్థానిక ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం కెఎస్.ప్రకాశ రావు దంపతులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొల్లపల్లి బుజ్జి, కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి, రిటైర్డ్ ఉద్యో గుల సంఘం గౌరవ అధ్యక్షుడు యు.సోమ రాజు, యుటిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు టి.సంజీవ్, కె.రవి, పాల్గొన్నారు.