ప్రజాశక్తి – సామర్లకోట
గిరిజన మండలాల్లో నివసించే ప్రజల హక్కులను కాపాడేందుకు ‘పెసా’ చట్టంపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ బుధవారంతో ముగిసింది. శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ జె.వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో ఎపిఎఐఆర్‌డి జెడి శ్రీదేవి, డిప్యూటీ డైరెక్టర్ జె.రామానాదం మాట్లాడారు. పెసా చట్టాన్ని అవగాహన చేసుకుని గిరిజన ప్రాంతాల, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. గిరిజన మండలాల్లో ఫిబ్రవరి నెలలో పెసా చట్టంపై ప్రజలకు, అధికారులకు, ఎస్‌హెచ్‌జి సభ్యులకు, ఎన్‌జిఒలకు మాస్టర్ ట్రైనీలు శిక్షణ కల్పించాలన్నారు. 5 జిల్లాలకు చెందిన 36 ఏజెన్సీ మండలాలకు సంబంధించి 215 మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్, ఫ్యాకల్టీలు పి.శ్రీనివాసరావు, వి.ప్రసాద్, కెఆర్.నిహారిక, వి.ఆంజనేయులు, ఎం.చక్రపాణిరావు, డిఆర్‌ఎన్ పద్మజ, పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి ప్రిన్సిపల్ వేణుగోపాల్ సర్టిఫికెట్లను అందజేశారు.