ప్రజాశక్తి – గండేపల్లి
సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ ప్రాంగణంలో జెఎన్‌టియుకె సెంట్రల్ జోన్ పరిధిలోని కళాశాలల ‘అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ – 2024” పోటీలు విజయవంతంగా ముగిశాయి. పురుషుల విభాగంలో ఆదిత్య కాలేజీ ఆఫ్ ఇంజ నీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల, మహిళల విభాగంలో గుడ్ల వల్లేరు ఎస్‌ఆర్ కళాశాల, మెన్ అండ్ విమెన్ ఛాంపియన్‌గా ఆది త్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విజేతలు గా నిలిచాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమం డిప్యూటీ ప్రో. ఛాన్సలర్ డాక్టర్ ఎం.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. జెఎన్‌టియుకె టోర్నమెంట్ పరిశీలకులు, అథ్లెటిక్ కోచ్ పిపివి.ప్రసాద్‌రెడ్డి, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.రమేష్ చేతుల మీదుగా విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్. వి.సత్యనారాయణ, డీన్ ఎకె.సుబ్బారావు, పిఇటి. అసోసియేషన్ నాయకులు నూకరాజు, ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రవి పాల్గొన్నారు.