ప్రజాశక్తి – పెద్దాపురం, సామర్లకోట, గొల్లప్రోలు
తమ సమస్యలు పరిష్కారం కోరుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం 3వ రోజుకు చేరింది. మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమకు వేతనాలు పెంచాలని, తమ డిమాండ్లను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు, కెవి.రమణ, ఆకుల రామకృష్ణ, స్వామి, వి.భాస్కర్, బి.భద్రరావు, టి.సాయికృష్ణ, జి.నాగేశ్వరరావు, ఎస్‌కె బషీర్, ఎం.శివ, ఎం.భద్రరావు, బి.రవిచంద్రకుమార్, జి.సతీష్, ఎస్.సత్తిరాజు, పి.శ్రీను పాల్గొన్నారు. సామర్లకోటలో జరుగుతున్న మున్సిపల్ ఇంజినీరింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెకు కౌన్సిలర్ నేతల హరిబాబు, కో ఆప్సన్ సభ్యులు మన్యం చంద్రరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే సమ్మెకు సిపిఎం నాయకులు పాల్గొని మద్దతునిచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో, ఆకలి బాధలతో అలమటించి పోతున్నామని, తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజినీరింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె కొనసాగించారు. యూనియన్ నాయకులు పడాల సూరిబాబు మాట్లాడుతూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించు కోలేక అప్పులు చేసుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధ శ్రీను, మొగిలి స్వామి, ఇతర కార్మికులు పాల్గొన్నారు.