కొనసాగిన ఆర్‌టిసి కార్మికుల ధర్నా

Oct 3,2024 22:58
సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కార్మికులు

ప్రజాశక్తి – ఏలేశ్వరం

ఏలేశ్వరం డిపో కండక్టర్‌పై అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కార్మికులు డిపో గేటు వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు యువిఎం.కుమార్‌, కె.త్రిమూ ర్తులు, కె.మాణిక్యం మాట్లాడుతూ హెడ్‌ ఆఫీస్‌ జాబ్‌ సెక్యూరిటీ గైడ్లైన్స్‌ పాటించకుండా ఉత్తమ కండక్టర్‌గా గుర్తింపు పొందిన శ్రీనును సస్పెండ్‌ చేయడం దారుణ మన్నారు. తక్షణమే శ్రీనుపై సస్పెన్షన్‌ను ఎత్తి వేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల మనో భావాలు దెబ్బతీసేలా డిపో మేనేజర్‌ ప్రవర్తిస్తు న్నారని ఆరోపించారు. శుక్రవారం నుంచి నిరవధిక రిలే నిరాహారదీక్షలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాని బాబు, ఎన్‌పి.రావు, బిఆర్‌ఎల్‌.రావు, కెఎస్‌.నారాయణ, రాజేష్‌, గ్యారేజీ చలం, అప్పలరాజు పాల్గొన్నారు.

➡️