కొనసాగిన కార్మికుల ఆందోళన

Jan 8,2025 22:53
బుధవారం నాటికి 54వ రోజుకు చేరింది.

ప్రజాశక్తి – ఏలేశ్వరం

చిన్నింపేట జీడిపిక్కల కార్మికుల ఆందోళన బుధవారం నాటికి 54వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద జరిగిన ధర్నాలో సిఐటియు జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యులు రొంగల ఈశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఫ్యాక్టరీని మూసివేయడంతో 54 రోజులుగా కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఫ్యాక్టరీని మూసివేసిన నాటి నుంచి వివిధ రూపాల్లో తమ ఆవేదనను ప్రభుత్వానికీ, ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలియ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అనిశెట్టి వీలరబాబు, చక్రధర్‌, గోవిందు, ధర్మాజీ, బి.ఆది, ఎం.కాంతారావు, రామదుర్గ, జయలక్ష్మి, అన్నపూర్ణ, శివలక్ష్మి, పాపారత్నం, చంటి, వరలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.

➡️