ప్రజాశక్తి – కాకినాడ
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. సిఐటియు జాతీయ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాట్ల రాంబాబు, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉద్యోగుల సంఘం నాయకులు గెద్దాడ సత్యనా రాయణ, సెకండ్ ఎఎన్‌ఎం సంఘం జిల్లా అధ్యక్షు రాలు సూర్యకుమారి, పంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడారు. పర్మినెంట్ ఉద్యోగులు చేసే పనినే కాంట్రాక్టు ఉద్యోగులతో పని చేయిస్తున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే అన్ని సదుపాయాలు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖలోనూ అమలు చేయడం లేదన్నారు. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వాలే ఉద్యోగుల శ్రమను దోచుకోవడం అన్యాయమన్నారు. ఎంఎల్‌ఎలు మాత్రం నెల జీతం రూ.రెండు లక్షలు తీసుకుంటున్నారని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు మాత్రమే అడుగుతున్నామని, అది కూడా చెల్లించకపోతే పెరుగుతున్న ధరలతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కాంట్రాక్టు ఉద్యోగులు చనిపోతుంటే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరూ పాయి సాయం కూడా అందడం లేదన్నారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు చేయడానికి నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. 50 లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక కార్మికులకు వేతన సవరణ చేసి 15 ఏళ్లు దాటిందని, తక్షణం కనీస వేతన సలహా మండలి నియమించి షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులకు వేతన సవరణ చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు అన్ని పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్లు నిర్వహించాలని కోరారు. 240 రోజులు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని, కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ రాహుల్‌మీన కు అందజేశారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, కోశాధి కారి మలకా రమణ, రూరల్ కన్వీనర్ బి రాజా, జిజిహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయ కులు విజరు కుమార్, పద్మ, లక్ష్మీ, క్లాబ్ డ్రైవర్స్ యూనియన్ గంగాధర్, మున్సిపల్ డ్రైవర్స్ యూని యన్ ప్రకాష్, శ్రీను, కాకినాడ క్లస్టర్ కమిటీ సభ్యులు అంగడి శ్రీను, నూకరాజు, సురేష్, రాంబాబు, శ్రీహరి, వి.సత్తిబాబు, పంచాయితీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నూకరాజు, సత్యన్నారా యణ, వెంకటరమణ, గాంధీ, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటరావు, ఎం.గోవింద్, సెకండ్ ఎఎన్‌ఎం సంఘం నాయకులు లీలారాణి, ఝాన్సీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం నాయకులు బి.శ్రీనివాస్, చిట్టిబాబు, రాజు, సురేష్, రమణ పాల్గొన్నారు.