సత్యనారాయణరాజు మృతి పట్ల సిపిఎం సంతాపం

Jun 8,2024 14:18 #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : యుటీఎఫ్ సీనియర్ నేత, పెన్షనర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి చుక్కన సత్యనారాయణ రాజు మృతి పట్ల సిపిఎం కాకినాడ జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ మధురానగర్ లో వారి ఇంటి వద్ద భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాజశేఖర్ మాట్లాడుతూ సత్యనారాయణ రాజు టీచర్ గా పనిచేస్తూ యుటీఎఫ్ లో పలు పదవులు నిర్వహించారని తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం పెన్సనర్ల సంఘం రాష్ట్ర కోశాధికారిగా పనిచేసారని తెలిపారు. నిరంతరం టీచర్ల, పెన్సనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారని రాజశేఖర్ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

➡️