ప్లాస్టిక్ తో జీవరాశులకు ప్రమాదం

Nov 14,2024 11:58 #Kakinada

నక్సా సీఈఓ డయాహున్ కాంగ్లాన్

ప్రజాశక్తి-తాళ్లరేవు: నదీ జలాల్లో కలుస్తున్న ప్లాస్టిక్ వల్ల జీవరాశులకు పెనుముప్పు వాటిల్ల నుందని, నక్సా సి.ఈ.ఓ. డయాహున్ కాంగ్లాన్ అన్నారు. కోరంగి అభయారణ్యంలో ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల సముద్ర జలాల్లో ఉన్న సూక్ష్మ జీవరాసులు, మట్టి, అభయారణ్యంలో ఉన్న చెట్లు, పక్షి జాతులు మత్స్య సంపద కు హాని కలగడం ద్వారా ప్రకృతి మనుగడ దెబ్బతింటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను ఎక్కడికక్కడే దగ్ధం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో చిన్నచిన్న కాలువలలో పడవల ద్వారా సుమారు 300 కేజీల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఎస్.ఎస్. ఆర్. వరప్రసాద్, అధికారులు ఎస్.వీరభద్రరావు, మహేష్,గోపీ నాగేంద్ర కుమార్, సుబాని, సంధ్యా రాణి, ధన లక్ష్మి, నక్సా, ఫారెస్ట్ సిబ్బంది పాల్గోన్నారు.

➡️