డెంగీ పట్ల అప్రమత్తత అవసరం

Nov 26,2024 23:24
పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని

ప్రజాశక్తి – తాళ్లరేవు

డెంగీ, మలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి పి.రవికుమార్‌ అన్నారు. స్థానిక గాంధీనగర్‌లో ఒక గర్భిణీకి డెంగీ సోకింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన సంబంధిత బాధితురాలిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్‌ నాటికి జిల్లావ్యాప్తంగా డెంగీ కేసులు తగ్గాయని, తిరిగి మళ్లీ నమోదు అవుతున్నాయని అన్నారు. డెంగీ నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, గృహాల్లోని పాత్రలు, ఫ్రిజ్‌ వంటి గృహోపకరణాల్లో ఉన్న నీటిలో ఉండే లార్వా వల్ల డెంగూ దోమలు వ్యాప్తి చెందుతాయని తెలిపారు. నిల్వ ఉన్న నీటిలో తోక పురుగులుగా ఉన్న దోమలు వైరస్‌ ఉన్న వ్యక్తులను కుట్టడం ద్వారా ఈ డెంగూ వ్యాధి మరొకరికి సోకుతుందని ఆయన వివరించారు. అనంతరం తాళ్లరేవు కేశవపురంలోని సబ్‌ సెంటర్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ పిహెచ్‌సి సిబ్బంది కె.ఆంజనేయులు, బొడ్డు కుమార్‌, జ్యోతి, కెఎన్‌.ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️