అభివృద్ధి పనులను పూర్తి చేయాలి

Nov 30,2024 22:51
ఆకర్షణియంగా, ఆహ్లాదకరంగా

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ సముద్రతీరలో ఉన్న బీచ్‌ ప్రాంతాన్ని పర్యాటకులకు ఆకర్షణియంగా, ఆహ్లాదకరంగా మలిచేం దుకు చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ షాన్‌మోహన్‌ అధికారులను ఆదేశిం చారు. శనివారం కలెక్టరేట్‌లో జెసి రాహుల్‌మీనా, మున్సిపల్‌ కమిష నర్‌ భావనతో కలిసి రెవెన్యూ, పర్యటకం, జిల్లా పరిషత్‌, పంచాయతీ, కుడా, శిల్పారామం, ఆర్‌టిసి తదితర శాఖల అధికారులతో సముద్ర తీరంలో సాగర సంబరాలు నిర్వహణకు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కుడా ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ ప్రారంభం, బీచ్‌ ఫ్రెంట్‌, రెస్టారెంట్‌, లైటింగ్‌, ఎగ్జిబిషన్స్‌, బీచ్‌ క్లీనింగ్‌, గ్లాస్‌ బ్రిడ్జి వంటి విషయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాకినాడ సముద్రతీర ప్రాంతానికి రోజు వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటార న్నారు. సందర్శకులకు మంచి ఆహ్లా దాన్ని అందించడంతో పాటు సముద్ర తీర ప్రాంతాన్ని ఆకర్షణంగా తీర్చిదిద్దేం దుకు అవస రమైన చర్యలు చేపట్టాల న్నారు. కాకినాడ రూరల్‌ మండలం వాకలపూడి వద్ద ఉన్న బీచ్‌ పార్క్‌, కుడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ను రానున్న డిసెంబర్‌ 20 నాటికి సందర్శకులకు అందుబా టులోకి తీసుకురావాలన్నారు. ఇందుకు పర్యా టకం, మున్సిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా పరిషత్‌, పంచాయతీ, శిల్పారామం ఇతర శాఖల అధికారులు ప్రణాళిక ప్రకారం పని చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రధానంగా రెండు నెలలపాటు ప్రతిరోజు బీచ్‌ క్లీనింగ్‌పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్లాస్టిక్‌ రహిత, పర్యావరణ సహిత, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ గా బీచ్‌ పార్క్‌ను తీర్చిదిద్దాలన్నారు. రిసార్ట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సందర్శకు లకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిల్పారామాన్ని ఇంకా సందర్శకులకు ఆకర్షణంగా తీర్చిది ద్దేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ సమా వేశంలో జడ్‌పి సిఇఒ వివివి ఎస్‌.లక్ష్మణ రావు, ఆర్‌డిఒ ఎస్‌.మల్లిబాబు, పంచా యతీ అధికారి వి.రవికుమార్‌, జిల్లా పర్యా టకశాఖ అధికారి పి.పోశయ్య, ఎపిటిడిసి మేనేజర్‌ సిహెచ్‌.పవన్‌ కుమార్‌, డిఇ జి.సత్యనారాయణ, ఎపిఒ వి.త్రిమూర్తులు, శిల్పారామం ప్రతినిధి సి.మోహన్‌ తేజ, కుడా, ఆర్‌టిసి అధికారులు పాల్గొన్నారు.

➡️