భవన నిర్మాణ కార్మికుల ధర్నా

Feb 1,2025 22:16
వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

ప్రజాశక్తి – కాకినాడ

ఆంధ్రప్రదేశ్‌ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గడిగట్ల సత్తిబాబు, కార్యనిర్వహక అధ్యక్షులు చెక్కల రాజ్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు డేగల సత్యనారాయణ, కార్పెంటర్‌ సంఘం జిల్లా నాయకులు వీరబాబు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు 2019 నుంచి సంక్షేమ పథకాలను నిలుపుదల చేసి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు ఆ హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ సలహాదారు కరణం విశ్వనాథం, జిల్లా ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ, ప్రకృతి ఈశ్వరరావు, పప్పుల వీరబాబు, ఎం.సత్తిబాబు, నక్కా రాజారావు, గరగ సుబ్రమణ్యం, బేవర బంగారయ్య, షేక్‌ వలీబాబా, జి.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️