క్లాప్‌ వాహన డ్రైవర్ల ధర్నా

Mar 18,2025 22:31
నడిపించేలా చర్యలు తీసుకోవాలని

ప్రజాశక్తి – కాకినాడ

నగర పాలక సంస్థ పరిధిలో తడి, పొడి చెత్త సేకరించే క్లాప్‌ వాహనాలకు ఇంధన సౌకర్యం కల్పించి నడిపించేలా చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో క్లాప్‌ డ్రైవర్లు ధర్నా నిర్వహిం చారు. మంగళవారం జగన్నాధపురం వాహనాల యార్డ్‌ వద్ద డ్రైవర్స్‌ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్‌ పలివెల వీరబాబు, డ్రైవర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు షేక్‌ ఇస్మాయిల్‌ మాట్లాడుతూ నగరంలో క్లాప్‌ వాహనాలు చెత్త సేకరణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం వల్ల క్లాప్‌ వాహన వ్యవస్థ కొనసాగుతుందో లేదో తెలియక డ్రైవర్స్‌ ఆందోళన చెందుతున్నారని తెలిపారు. నగర పాలక సంస్థ రూ.30 లక్షలు చెల్లించినా కాంట్రాక్టు సంస్థకు జమ కాలేదని చెబుతున్నారన్నారు. మున్సిపల్‌ ఉన్నతాధికారులు స్పందించి క్లాప్‌ వాహ నాలు నడిపించడానికి తగిన చర్యలు తీసుకోవా లన్నారు. మార్చి 1 నుంచి గ్యాస్‌, పెట్రోల్‌ వాహ నాలకు వేయించకపోవడం వల్ల నిలిచిపోయాయని, దీంతో డ్రైవర్ల ఉపాధికి గండి పడిందని అన్నారు. అలాగే డ్రైవర్లకు 3 నెలల బకాయి జీతాలు చెల్లిం చాలని, 2024 జనవరి నుంచి డ్రైవర్స్‌ జీతాలు నుంచి మినహాయించిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ ఖాతాలకు జమ చేయాలన్నారు. వారాంతపు సెలవులు, క్యాజు వల్‌ లీవులు అమలు చేయాలన్నారు. ప్రభుత్వ జిఒ ప్రకారం క్లాప్‌ వాహన డ్రైవర్స్‌కి రూ.24,500 కనీస వేతనం అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్‌ మలక వెంకటరమణ, యూనియన్‌ నాయకులు నక్కా గంగాధర్‌, బి.శివశ్రీను, ఎం.శివశంకర్‌, వి.అరుణ్‌ కుమార్‌, వై.దుర్గాప్రసాద్‌, భద్రరావు, వీరేంద్ర, దుర్గాప్రసాద్‌, వీరబాబు, లక్ష్మణ్‌కుమార్‌, వంశీ, శివ, భైరవస్వామి, గంగాధర్‌, సూరిబాబు పాల్గొన్నారు.

➡️