ప్రజాశక్తి – కాకినాడ
రాష్ట్రవ్యాప్తంగా లక్ష 30 వేల మంది వాలంటీర్లను కొనసాగించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపి గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ (సిఐటియు అనుబం ధం) నాయకులు డి.రమేష్, ఎన్.నాగలక్ష్మి, సంతోషి ణి, వరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లందరిని కొనసాగి స్తామని, రూ.10 వేలు వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. ఇప్పటికీ వాలంటీర్ల బకాయి వేతనాలు కానీ, కొనసాగింపుపై స్పష్టతగానీ, పెంచుతానన్న వేతనంపై క్లారిటీ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 1,30,000 మంది వాలంటీర్లు రోడ్డు మీదకు వచ్చి పోరాడడం మినహా మరొక దారి లేదని తెలిపారు. వాలంటీరు ఉద్యోగమే ప్రధాన ఆదాయ వనరుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు ప్రాణాలకు తెగించి పనిచేసినా ఉద్యోగ భద్రత లేకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తుందని, వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామా చేయిం చిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుని, రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధులలోకి తీసుకోవాలని కోరారు. ఈ ఆందోళ నలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిశెట్టి వెంకటరమణ, వాలంటీర్లు ఎన్.నాగ లక్ష్మి, బి.కుమారి, కె.దుర్గాదేవి, వరలక్ష్మి, స్వర్ణ పాల్గొన్నారు.