ప్రజాశక్తి – యు.కొత్తపల్లి
బీచ్ రోడ్‌లో పలు వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు కనీసం హెచ్చరిక బోర్డు కానరావడం లేదు. కళ్లదుటే వంతెనల ప్రమాదకరంగా కన్పిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అద్దరపేట నుంచి కాకినాడకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, ఇతర అవసరాల కోసం వెళ్లే వారు అధికంగానే ఉంటారు. అలాగే వివిధ వ్యాపారాలకు సంబం ధించిన వాహనాలు భారీగానే రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రయాణాలన్నీ బీచ్ రోడ్డు మార్గంలోనే సాగుతుం టాయి. బీచ్ రోడ్డులో అదిరిపేట నుంచి కాకినాడ వరకూ సుమారు 10 వంతెనలు ఉన్నాయి. నేమం సమీపంలో ఉన్న వంతెనలు, శీలవారిపాలెం సమీపంలో ఉన్న వంతెన శిథిలా వస్థకు చేరుకున్నాయి. నెలలు గడుస్తున్న ఈ వంతెనలకు మరమ్మతు పనులు చేపట్టిన పరిస్థితి లేదు. కనీసం హెచ్చ రిక బోర్డులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవని ప్రయాణి కులు చెబుతున్నారు. వంతెనలు చిన్నగా ఉండడం, ఎదురె దురుగా వాహనాలు వస్తే తప్పించుకునే క్రమంలో ఈ వంతెనలకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడంతో ఏదైనా జరగరానిది జరిగితే వాహనాలు ఉప్పు టేరులో గల్లం తవ్వ డం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగి నప్పుడు హడావుడి చేసే అధికార యం త్రాంగం ప్రమాదాల నివారణకు అవస రమైన చర్యల్లో భాగం గా ఈ వంతెనలకు మరమ్మతు పనులు చేపట్టకపో వడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కౖనా సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న వంతెనలకు మరమ్మతులు చేపట్టడంతోపాటు, ఆయా వంతెనల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.