ప్రజాశక్తి – యు.కొత్తపల్లి
విఒఎ విధుల తనను అకారణంగా తొలగించారంటూ ఉప్పాడ-2 విఒఎ తిరంశెట్టి చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తాను గత 16 నెలలుగా వెలుగు కార్యాలయంలో విఒఎగా విధులు నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. నాటి ఎపిఎం షకీనా ప్రియదర్శిని విఒఎగా బాధ్యతలు అప్పగించారని, నాటి నుంచి నేటి వరకూ ఉప్పాడ-2 విఒఎగా విధులు నిర్వరిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆన్‌లైన్‌లో నేడు తన పేరు తొలగించారని, దీనికి కారణం ప్రస్తుత ఎపిఎం అని ఆమె ఆరోపించారు. తాను ఇద్దరు చిన్నారులతో ఉన్నానని, తన కుటుంబ పోషణ ఎలా అని ఆమె ప్రశ్నించారు. డిప్యూటీ సిఎం పవన్‌కళ్యాణ్, కలెక్టర్, డిఆర్‌డిఎ పీడీల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. దీనిపై ఎపిఎం తౌడును వివరణ కోరగా గ్రామ సంఘాల సభ్యులు చేసే తీర్మాణాలకు అనుగుణంగానే విఒఎల నియామకాలు, తొలగింపులు ఉంటాయని, ఎపిఎం, సిసిలకు ఎటువంటి ప్రమేయం ఉండదని వివరణ ఇచ్చారు.