పోలింగ్‌ సామగ్రి పంపిణీ

May 12,2024 22:42
స్థానిక మహారాణి కళాశాల

ప్రజాశక్తి – పెద్దాపురం

స్థానిక మహారాణి కళాశాల ఆవరణలో ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 201పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్‌ సామాగ్రి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి జె సీతారామారావు మాట్లాడుతూ 201 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 1382 మంది సిబ్బంది ఉన్నారన్నారు. 13న జరిగే పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నియోజకవర్గ పరిధిలో 46 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రశాంత వాతావరణంలో నియోజకవర్గ పరిధిలోని 2,15,095 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 22 మంది సెక్టార్‌ అధికారులు, 29 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తారన్నారు. పోలింగ్‌ సిబ్బంది 22 రూట్‌లు ద్వారా 50 వాహనాలలో పోలింగ్‌ సామగ్రితో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి లతా కుమారి పాల్గొన్నారు.

➡️