స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో కళ్లజోళ్ళు పంపిణీ

Jan 15,2025 22:02
నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో

ప్రజాశక్తి – కరప

స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో యండమూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో కళ్ళజోళ్ళ కోసం గుర్తించిన వారికి బుధవారం ఉదయం అంబే ద్కర్‌ కమ్యూనిటీ భవన ప్రాంగణంలో కళ్ళజోళ్ళు పంపిణీ జరిగింది. కమర్షియల్‌ టాక్స్‌ అధికారి సాంబ త్తులు వెంకట్రావు, స్వర్ణాంధ్ర నిర్వాహకులు లయన్‌ డాక్టర్‌ గుబ్బల రాంబాబు, గ్రామ సర్పంచ్‌ మారెళ్ళ శివ చేతులమీదుగా 72 మందికి కళ్లజోళ్లను ఉచితంగా అందజేశారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారి వెంకట్రావు మాట్లాడుతూ పండుగ వేళ పదిమందికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర నిర్వా హకులు రాంబాబు అభినం దనీయులని అన్నారు. స్వగ్రామానికి సేవలు అందించడం అందరికీ స్ఫూర్తిని ఇస్తుందన్నారు. స్వర్ణాంధ్ర రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 27 సంవత్సరాలుగా సుమారు 1000కి పైబడి ఉచిత వైద్య సేవ శిబిరాలు నిర్వహించిం దని, ప్రతి శిబిరంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు, కంటి ఆపరేషన్లు, తదుపరి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వైద్య శిబిరంలో గుర్తించిన సుమారు 18 మందికి ఉచితంగా ఆపరేషన్‌ చేయించి వారికి అవసరమైన మందులు అందించినట్లు చెప్పారు. స్వగ్రామానికి సేవలు అందించడం అదృష్టంగా భావిస్తున్నానని, అవసరం అయితే మరిన్ని సేవలు అందించేందుకు స్వర్ణాంధ్ర తరపున సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెట్ట రాంబాబు, జనపల్లి సాగర్‌, మారెళ్ళ శ్రీనివాసరావు, గుబ్బల ఏడు కొండలు, బల్ల యేసయ్య, సాంబత్తుల రఘువర్మ, స్వర్ణాంధ్ర సేవా సంస్థ వాలంటీర్స్‌, పాల్గొన్నారు.

➡️