ప్రజాశక్తి – కాకినాడ
పారిశుధ్య నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఆదేశించారు. బుధవారం ఆమె నగరంలోని 7, 8 డివిజన్లలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో చెత్త సేకరణ పనులు ఎలా జరుగుతున్నదీ ఆరా తీశారు. చెత్త సేకరణ వెహికల్స్ ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో విధులకు హాజరుకావాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పర్యటనలో ఎంహెచ్‌ఓ డాక్టర్ పృథ్వీచరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.