ప్రజాశక్తి – కాకినాడ
రజక వృత్తిదారులకు ఉపయోగపడే దోబీఘాట్‌లను నిర్మాణం చేయాలని ఎపి రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందర య్య భవన్‌లో సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రాజు మాట్లాడుతూ రజకవృత్తి దారుల సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దోబీ ఘాట్‌ల నిర్మాణం చేపట్టాలని, ప్రతి రజక కుటుం బానికి 250 యూనిట్‌ల వరకూ ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని, 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ నాయ కులు కె.మాణిక్యం, కొజ్జవరపు నాగేశ్వరరావు, పాకలపాటి.సోమరాజు, శ్రీనివాస్, కొండబాబు, మణీ, గంగాధర్ రావు, కనకరాజు, అప్పారావు పాల్గొన్నారు.