త్రాగునీటి క్లోరిన్ తనిఖీలు సక్రమంగా నిర్వహించాలి

Apr 16,2025 13:07 #Kakinada district

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : ఆర్డబ్ల్యూఎస్ రక్షిత మంచినీటి పథకం ద్వారా గ్రామాలలో అందిస్తున్న త్రాగునీరు క్లోరిన్ తనిఖీలపై సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గుజరాత్ నుండి నేషనల్ వాటర్ ఎక్స్పెక్ట్ పీటర్ ఆనంద్ థామస్ బాయ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు బుధవారం ఉప్పాడ, అమీనాబాద్, కొనపాపేట గ్రామాలలో పర్యటించి అక్కడ ప్రజలను రక్షిత మంచినీటి పథకం ద్వారా త్రాగునీరు ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయాల్లో అంగనవాడి, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గ్రామాల్లో అందిస్తున్న త్రాగునీరు క్లోరిన్ శాతం ఏ విధంగా తనిఖీ చేయాలి. సచివాలయాల్లో ఉన్న త్రాగునీటి తనిఖీ కిట్లు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అడిగి తెలుసుకుని తనిఖీట్లపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీరుపై అవగాహన కల్పించాలని సూచించారు ఈయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, జెఈ రమణ, పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్ కుమార్, శ్రీనివాస్, అమీనాబాద్ సర్పంచ్ నక్క మణికంఠ తదితరులు ఉన్నారు.

➡️