ప్రజాశక్తి – తాళ్లరేవు
ఎంఎంల్‌ఎ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు పురస్కరించుకుని సీతారామ పురంలో మెగా క్రికెట్ టోర్నీని గురువారం తహశీల్దార్ పి.త్రినాధరావు ప్రారంభించారు. ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల నుంచి 36 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని నిర్వాహకులు టేకుమూడి సత్యనారాయణ తెలిపారు. విజేతలకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందించనున్నట్లు తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. అయినాపురం, సీతారామపురం జట్లు, కోరంగి, తాళ్ళరేవు జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ జరిగింది. ఈ సందర్భంగా లక్కీ డిప్ విజేతలకు హెల్మెట్లు అందజేశారు. యువకులు క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనాలని, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తహసిల్దార్ త్రినాధ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం డి.సి. వైస్ ఛైర్మన్ కొత్తూరు కాశీఈశ్వరుడు, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మాజీ జడ్‌పిటిసి పొన్నమండ రామలక్ష్మి, భజన సత్తిబాబు, గుత్తుల సూర్యనారాయణ, గంజా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.