సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

Feb 5,2025 22:38
కృషి చేయాలని నీటి పారుదల

ప్రజాశక్తి – ప్రత్తిపాడు

నియోజకవర్గంలో సాగునీటి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఎంఎల్‌ఎ వరుపుల సత్యప్రభ కోరారు. బుధవారం నిడదవోలు పర్యటనకు వచ్చిన ఆయనను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో సాగునీటి సమస్యలకు సంబంధించి వినతిపత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలో నాలుగు ప్రధాన జలాశయాలు ఉన్నప్పటికీ అవసరమైన నీరు రైతులకు అందడం లేదన్నారు. ఇదే విషయంపై అసెంబ్లీలో కూడా ప్రస్తావించినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం దాల్వా పంటలకు సాగునీరు లేక నియోజకవర్గంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, తక్షణమే రైతులకు నీరు అందించేలా కృషి చేయాలని మంత్రికి వివరించారు. ఏలేరు కాలువకు ఆధునీకరణ చేపట్టి తూములు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి రామానాయుడు అధికారులను ఆదేశించారని ఎంఎల్‌ఎ స్థానిక మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గొల్లపల్లి బుజ్జి, పర్వత సురేష్‌, ఇళ్ల అప్పారావు, అమరాది వెంకట్రావు పాల్గొన్నారు.

➡️