ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలి

Jun 11,2024 22:49
ఉపాధి హామీ కూలీలకు

ప్రజాశక్తి – పిఠాపురం

ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం మండలంలోని జములపల్లి గ్రామంలో ఉపాధి పనుల ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కూలీల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తమకు ఐదు వారాల కూలి బకాయిలను నేటికీ ఇవ్వలేదని, ఎండలో కష్టపడి పనిచేసినా తమకు రావాల్సిన కూలి డబ్బులు ఇవ్వలేదన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ అరకొర కూలితో ఉపాధి పనులు నిర్వహిస్తున్న కూలీల కూలి సొమ్ము 4, 5 వారాలైనా ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. కూలి బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ పర్యటనలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.సింహాచలం, మండల నాయకులు ఆర్‌.భూలోకం, బుల్లబ్బాయి, బాబ్జి, సూరిబాబు పాల్గొన్నారు.

➡️