ఇంజినీరింగ్‌ కార్మికుల సమ్మె

May 16,2025 22:29
సమ్మెను శుక్రవారం చేపట్టారు.

ప్రజాశక్తి – సామర్లకోట

తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు నిరవధిక సమ్మెను శుక్రవారం చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికులు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాంకేతిక నిపుణత కలిగిన కార్మికులకు రూ.29,200, నాన్‌ టెక్నికల్‌ కార్మికులకు రూ.24,500 వేతనాలు ఇవ్వాలని, 15 సంవత్సరాల సర్వీసు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం వేతనాల చెల్లింపులు జరపాలని డిమాండ్‌ చేశారు. సంక్షేమ పథకాలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రామరాజు, కృష్ణ, రత్నరాజు, రమేష్‌, మురళీకృష్ణ, సత్యనారాయణ, భూదేవి, నాగార్జున, వెంకటేశ్వరరావు, స్వామి, రాజేష్‌, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

➡️