ప్రజాశక్తి – జగ్గంపేట
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిదీ అనికలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. బుధవారం కిర్లంపూడి పిహెచ్‌సిని ఆయన సందర్శించారు. అలాగే బూరుగుపూడి సచివాలయం, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పరిశీలిం చారు. అలాగే జగ్గంపేట మండలం మామిడాడలో నూతనంగా నిర్మించిన గోకులల షెడ్డును ఆయన ప్రారంభించారు. కాండ్రేగులలో ఉపాధిహామీ పథకంలో చేస్తున్న చెరువు పనులను పరిశీలించారు. జగ్గంపేట పశువుల ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న పరిసరాల పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత శనివారం ఆసుపత్రి పరిసరాలను ఎందుకు శుభ్రం చేయాలని నిలదీశారు. వచ్చే శనివారం వెటర్నరీ 12 మంది సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా పర్యటించి నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్, ఎంపిడిఒ చంద్రశేఖర్, సిడిపిఒ పూర్ణిమ, పశువుల వైద్యులు డాక్టర్ తాతయ్య, సిబ్బంది పాల్గొన్నారు.