అంతా కల్తీ మయం

Oct 2,2024 22:45
అంతా కల్తీ మయం

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి మీరు హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు వెళ్లి నోరు ఊరించే ఆహార పదార్థాలను ఆరగిస్తున్నారా.? వేడిగా, కారం కారంగా ఉండే బజ్జీలు, ఘాటుగా వాసన వస్తున్న నూడిల్స్‌, ఫ్రైడ్‌ రైస్‌, సమోసాలు ఇష్టంగా తింటున్నారా.? రుచిగా, చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న వివిధ రకాల ఫుడ్స్‌ తరచూ వాడుతున్నారా అయితే ఒక్కసారి ఆలోచించండి. ఆహార పదార్థాలు రుచి ఎక్కువగా ఉండడం కోసం ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ప్రమాదకర రసాయనాలను వినియోస్తున్నారని ఎప్పుడైనా గమనించారా? మీ ఆరోగ్యాలను నాశనం చేస్తున్నాయని ఏనాడైనా ఆలోచించారా.? దాదాపు 90 శాతం దుకాణాల్లో కల్తీ, నాసిరకం ఆయిల్‌ వినియోగించడమే కాక రుచి, సుచి కోసం కెమికల్స్‌ విరివిగా వాడుతున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడవుతోంది.పదే పదే అదే నూనెకాకినాడ సిటీలో చిన్నా, పెద్దా కలిపి దాదాపు 500, తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, పట్టణాలు ఇతర మండల కేంద్రాలాల్లో మరో 1500 వరకూ హోటళ్లు,ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, వివిధ రకాల ఫుడ్‌ కోర్టులు నడుస్తున్నాయి. ఇవి కాకుండా అన్ని గ్రామాల్లోనూ బజ్జీలు, నూడుల్స్‌, స్వీట్స్‌ స్టాల్స్‌, ఇతర తినుబండారాల దుకాణాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్‌తో చేసే వివిధ అనేక రకాల తినుబండారాలను తయారు చేస్తున్నారు. పలు హోటళ్లు, స్వీట్స్‌ స్టాల్స్‌, పాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, ఇతర తినుబండారాల షాపుల్లో యథేచ్ఛగా నాసిరకం నూనెలను వినియోగించడమే కాక వాడిన నూనెలను పలుమార్లు మరిగించి మరిగించి నిబంధనలను పక్కన పెడుతున్నారు. ఒకసారి వాడిన వంట నూనెను మూడు సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. ఎక్కువసార్లు నూనెను మరిగిస్తే అందులోని భౌతిక, రసాయన, పోషక, ఇంద్రియ లక్షణాల్లో మర్పు వస్తుంది. నూనె నాణ్యతలో టిపిసి శాతం లోపిస్తే అనేక అనర్థాలు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 25 శాతం మించితే బిపి పెరిగి గుండె, కాలేయం వ్యాధులు ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు.రంగులు, రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగించే టేస్టింగ్‌ సాల్ట్‌, కాలుష్యం కార్బైడ్‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలను అందరూ తినే ఆహార పదార్థాల్లో వాడుతున్నా వినియోగదారులు అవేమీ పట్టించుకోవడం లేదు. మరోవైపు అధికారుల నియంత్రణ కూడా పూర్తిగా కొరవడిన నేపథ్యంలో వారి ఇష్టారీతిన వంటకాలు తయారీ, అమ్మకాలు సాగిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. రోజులు తరబడి ఫుడ్‌ నిల్వ ఉంచేందుకు కలర్‌ కోటింగ్‌ ఇస్తున్నారు. ముఖ్యంగా బేకరీల్లో స్వీట్స్‌ కేకులకు వాడుతున్న రంగులు, కెమికల్స్‌ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. బార్లు రెస్టారెంట్లు దాబాల్లో ఫుడ్‌ బాగా రుచిగా ఉండేందుకు వివిధ రకాల కెమికల్స్‌ వాడుతున్నట్లు సమాచారం.అధికరుల పర్యవేక్షణ గాలికిలైసెన్సులు లేకపోయినా అనేక చోట్ల విచ్చలవిడిగా ఆయా ఫుడ్‌ సెంటర్లు నడుస్తున్నాయి. నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారీతిన అమ్మకాలు సాగిస్తున్నా అధికారులు పర్యవేక్షణ కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌ కంట్రోల్‌ అధికారుల సిబ్బంది కొరత వల్ల కాకినాడ జిల్లాలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు. కీలకమైన శాఖకు సరిపడా సిబ్బంది లేరు. ఉన్న వారికి కూడా సొంత వాహనాలు కూడా లేవు. దాంతో ప్రజారోగ్యాన్ని పర్యవేక్షించే దిక్కు లేకుండా పోతుంది.

➡️