పైడాలో ఉత్సాహంగా ప్లేస్‌మెంట్‌ డే

May 25,2024 22:19
పైడాలో ఉత్సాహంగా ప్లేస్‌మెంట్‌ డే

ప్రజాశక్తి – తాళ్లరేవుమండలంలోని పటవల పైడా గ్రూప్‌ విద్యాసంస్థల్లో ప్లేస్‌ మెంట్‌ డేను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. ప్రముఖ నవలా రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కంపెనీలలో నియామకాలు పొందిన డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు 362 మంది విద్యార్థులు, వా తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ప్రిన్సిపల్‌ సూర్య ప్రకాష్‌ అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభలోలో వీరేంద్రనాథ్‌ మాట్లాడారు. విద్యార్థులు ఉద్యోగాలు సాధించిన తరువాత ఆ పనిలో నిపుణత ఎంత వేగంగా నేర్చుకుంటే అంత అభివృద్ధి సాధిస్తారన్నారు. జీవితంలో నిర్ధిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని, అందరూ కష్టపడి చదవమని చెబుతారని, కాని ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారన్నారు. జీవితంలో ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో చేరినా తల్లిదండ్రులకు ఎప్పుడు మంచి కుమారుడు, కుమార్తెలుగా ఉండాలని సూచించారు. వీరేంద్రనాథ్‌ను పైడా విద్యాసంస్థల కరస్పాండెంట్‌ శ్రీరామ్‌, నిత్య దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెఎన్‌టియుకె కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధ్యాపకులు కృష్ణమోహన్‌, డీన్‌ డాక్టర్‌ వీరభద్రరావు, డిడి రవీంద్ర రెడ్డి, ప్రిన్సిపల్స్‌ డాక్టర్‌ కేశవ్‌, సురేష్‌ కుమార్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ రవికుమార్‌, అకడమిక్‌ డైరెక్టర్‌ వంశీకృష్ణరాజా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️