విమానాశ్రయం వద్దంటూ రైతుల వినతి

Oct 30,2024 23:26
విమానాశ్రయం వద్దంటూ

ప్రజాశక్తి – తొండంగి

మండలంలోని బెండపూడి గ్రామంలో పచ్చని పొలాల మధ్య విమానాశ్రయం వద్దంటూ సంబంధిత బాధిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం సుమారు 500 మంది రైతు లు తమ పొలాల వద్ద నుంచి ర్యాలీగా రెవెన్యూ కార్యా లయానికి చేరుకున్నారు. అనంతరం వారు తహశీ ల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లా డుతూ విమానాశ్రయం ఏర్పాటు చేయడం ద్వారా బెండపూడి, చిన్నయ్యపాలెం గ్రామాలకు చెందిన ఏడా దికి రెండు పంటలు పండే పొలాలు నాశనం అవుతా యని అన్నారు. తద్వారా ఆహార భద్రతకు కరువు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సుమారు 1200 మంది సన్న, చిన్నకారు రైతులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పోలవరం, పుష్కర, హైవే రహ దారులకు భూములు కోల్పోయామని, విమానాశ్రయం అంటూ మాకున్న అరకొర భూములను కోల్పోతే తమ కుటుంబాల జీవణం ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించే యోచనను విరమించు కోవాలని విజ్ఞప్తి చేశారు. తమ అభిప్రా యాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకు వెళ్తే తమ ఉద్యమ కార్యచరణను ప్రకటించాల్సి వుంటుందని రైతులు స్పష్టం చేశారు.

➡️