ప్రజాశక్తి – సామర్లకోట
ఉపాధ్యాయులు నల్లం అచ్యుత రామచంద్రమూర్తి, పద్మజ దంపతులకు శిక్ష సాగర్ పురస్కారం అందుకున్నారు. శిక్షా సాగర్ ఫౌండేషన్ గుజరాత్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల ఉపాధ్యాయులతో జరిగిన ఆన్‌లైన్ చర్చ గోష్టిలో యు.కొత్తపల్లి జడ్‌పి బాలుర పాఠశాల ఉపాధ్యాయిని యాళ్ల పద్మజ, స్థానిక మూలపేట జడ్‌పి ఉన్నత పాఠశాల ప్లస్ ఉపాధ్యాయుడు నల్లం అచ్యుత రామచంద్రమూర్తి పాల్గొని శిక్ష సాగర్ ఫౌండేషన్ ద్వారా ‘ఉర్ వీరంగా టిలు రుతు రాష్ట్రీయ శిక్షక్ సామాన్ అవార్డు’కు ఎంపికయ్యారు. ఈ అవార్డును జాతీయంగా సాంస్కృతిక, సాంఘిక, విద్య పరంగా విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి ఇవ్వడం జరిగిందని వారు చెప్పారు. ఈ అవార్డు అందుకున్న సందర్భంగా రామచంద్ర మూర్తి దంపతులను గామ పెద్దలు రావు చిన్నరావు, హెచ్‌ఎం రమణమూర్తి, జి.శ్రీనివాసరావు, ఎస్‌ఎంసి ఛైర్మన్‌లు, సభ్యులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు.