బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Mar 8,2025 22:52
దంపతులకు నెలలు నిండకుండా జన్మించిన

ప్రజాశక్తి – కరప

కరప గ్రామానికి చెందిన వీర విజయలక్ష్మి, సత్యనారాయణ దంపతులకు నెలలు నిండకుండా జన్మించిన కవలల వైద్యం ఖర్చుల కోసం చేయూత స్వచ్ఛంద సంస్థ రూ.70 వేల సాయం అందించింది. చేయూత సంస్థ ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణ మూర్తి, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్‌, అలీమ్‌లతోపాటు సభ్యుల నుంచి సేకరించిన నగదును చెక్కు రూపంలో మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయూత మహిళా విభాగం సభ్యులు డేగల లక్ష్మి, పరసా ఝాన్సిశేషుకుమారి, మాధవి, రమాదేవి, కుమారి పాల్గొన్నారు.

➡️