ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Jan 13,2025 22:39
పాటించాలని సిఐ జి.శ్రీనివాస్‌ అన్నారు.

ప్రజాశక్తి – పిఠాపురం

ట్రాఫిక్‌ నిబం ధనలను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలని సిఐ జి.శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం స్థానిక ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్న వారిని, డ్రైవింగ్‌ లైసన్సు లేని వాహన దారులకు అపరాధ రుసుము విధించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు, నెంబర్‌ ప్లేట్స్‌ లేని వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. వాహనాలు నడిపే మైనర్లుకు వారి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. ట్రాఫిక్‌ నిబంధనలు, సురక్షితమైన డ్రైవింగ్‌ గురించి తగు జాగ్రత్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు మణికుమార్‌, జాన్‌ భాషా, సిబ్బంది పాల్గొన్నారు.

➡️