ప్రజాశక్తి-ప్రత్తిపాడు గిరిజన ప్రాంతాలైన బురదకోట, దారపల్లి ప్రాంతాల్లో పులి కదలికపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచామని, ట్రాప్ కెమేరాలు ఏర్పాటు చేశామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె.దుర్గారామ్ ప్రసాద్ తెలిపారు. గిరిజన ప్రాంతవాసులు పులి కదలికలపై ధైర్యంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలైన లంపకలోవ, రౌతుపాలెం తదితర గ్రామాల్లో పొలాల్లోనూ, అటవీ ప్రాంతాల్లో జంతువులను వేటాడటానికి కరెంటు వైర్లు పెట్టడం తమ దృష్టికి వచ్చిందని తక్షణమే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అటవి ప్రాంతాల్లోను, సబ్ ప్లాన్ ప్రాంతాల్లో కరెంటు వైర్లు పెట్టకుండా ఎలక్ట్రికల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించి ఫారెస్ట్ అధికారులకు సహకరించాలన్నారు. కొన్ని గ్రామాల్లో పులి సంచరిస్తోందని, పాదాలు పంట పొలాల్లో ఉన్నాయని ఫోన్ చేసి గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. అటువంటి పాదముద్రలు ఉంటే అటవీశాఖ అధికారులకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాలన్నారు.
![పులి కదలికలపై ఫారెస్ట్ సిబ్బంది నిఘా](https://prajasakti.com/wp-content/uploads/2024/12/Untitled-1-copy-51.jpg)