జనావాసాల్లో గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

Oct 8,2024 22:55
నిర్మిస్తున్న గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

ప్రజాశక్తి – తాళ్లరేవు రూరల్‌

మండలంలోని పోలేకుర్రు పంచా యతీ సుంకటరేవు సమీపంలో నిర్మిస్తున్న గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ పనులను గ్రామస్తులు అడ్డుకు న్నారు. మంగళవారం పోలేకుర్రు సర్పంచ్‌ వెంటపల్లి నూకరాజు, టిడిపి నాయకులు జక్కల ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకుని, పనులు నిలుదల చేశారు. రిలయన్స్‌ గ్యాస్‌ పైప్‌ లైన్‌ ఉన్న ప్రాంతం నుంచి పైప్‌ లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌, హర్యానా సిటీ గ్యాస్‌ సంస్థ ద్వారా సుంకటరేవు నుంచి యానాం రీజన్సీ కంపెనీకి గ్యాస్‌ పైప్‌ లైన్‌ వేశారు. గ్యాస్‌ యానాం తరలిం చడానికి సుంకట రేవు వద్ద ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే మంచినీటి పైపులైన్‌ వేస్తున్నామని అసత్యా లు చెప్పి, గ్రామస్తులతో చర్చించకుడా, ప్రమాద కరమైన పనులు పంచా యతీ అనుమతులు లేకుండా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిం చారు. జనావాసాల మధ్య నిర్మిస్తున్న ఈ ఫిల్లింగ్‌ కేంద్రం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారనీ ప్రశ్నించారు. సంఘటనా స్థలానికి కోరంగి ఎస్‌ఐ పి.సత్యనా రాయణ, ఆర్‌ఐ జి.రామకృష్ణ చేరుకుని కంపెనీ ప్రతినిధులు ధర్మారావు, త్రినాధరావు, గ్రామస్తులతో చర్చించారు. ఉన్న తాధికారులతో చర్చించి రెవెన్యూ అధికారుల సమక్షంలో త్వరలో సమావేశం ఏర్పాటు ప్రజలతో చర్చలు జరుపుతామని అధికారులు చెప్పడంతో ఆందోళన విరమిం చారు. ఈ కార్య క్రమంలో నాయకులు నిమ్మకాయల మూర్తి, పలివెల నాగేశ్వర రావు, విఆర్‌ఒ దాసు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

➡️