ప్రజాశక్తి – తాళ్లరేవు, గొల్లప్రోలు, గండేపల్లి
తాళ్లరేవు మండంలోని పటవల పైడా విద్యాసంస్థల ఆధ్వర్యంలో పైడా క్రాంతి పేరుతో శనివారం సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. భోగిమంట వెలిగించి కోడిపుంజులతో ఆటలు ఆడించారు. విద్యార్థులతో కలిసి దింసా నృత్యాన్ని చేసి ఎడ్ల బండి ఎక్కి ఊరేగారు. ప్రభల ఊరేగింపులో యువకులతో కలిసి సాగారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థి దశలో అల్లరి చేయడం సాధారణమైన విషయమేనని, అయితే దానికి హద్దులు ఉండాలని అన్నారు. శృతి మించితే జీవితం ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. ముఖ్యంగా గంజాయి విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పైడా విద్యా సంస్థల సెక్రెటరీ సత్య శ్రీరామ్ మంత్రి సుభాష్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పివి.సూర్యప్రకాష్, జాయింట్ సెక్రెటరీ నిత్య శ్రీరామ్, డీన్ వీరభద్రరావు, డిడి రవీందర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ రవికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో ఉన్న ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాలను అలంకరించారు. కళాశాల ఛైర్మన్ బుర్రా అనుబాబు, కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ బుర్రా అనురాధ భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. భోగి మంట చుట్టూ విద్యార్థులు నృత్యం చేస్తూ సందడి చేశారు.వి ద్యార్ధులు వివిధ రకాల సాంప్రదాయ వంటకాలు ప్రదర్శిం చారు. ఈ సందర్భంగా చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లా డుతూ భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతను విద్యా ర్థులకు వివరించారు. ఈ కార్యక్రమాల్లో బి టెక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.శ్రీనివాసరావు, డిప్లొమా ప్రిన్సిపల్ డాక్టర్ వైవిఎన్.రాజశేఖర్, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొ న్నారు. అలాగే గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రగతి కల్చరల్, స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతి ఇంజ నీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ విద్యార్ధి దశలో విద్యార్ధులందరూ క్రమశిక్షణ, ప్రతిభ, అకుంఠిత దీక్షతో పాటు సేవా తత్పరత కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు రంగోలీ, గాలిపటాలను ఎగుర వేసే పోటీల్లో పాల్గొన్నారు. త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, జాy ెలిన్ త్రో, షాట్‌ఫుట్, రన్నింగ్ క్రీడలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్య క్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి.నరేష్, డైరక్టర్ మేనేజ్‌మెంట్ ఎంవి. హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు